calender_icon.png 14 February, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్తు పదార్థాల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి

14-02-2025 01:26:01 AM

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి ప్రముఖ హీరో సుమన్

 కామారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : మత్తు పదార్థాల నియంత్రణకు కఠినమైన చట్టాలు తేవాలని ప్రముఖ హీరో సుమన్ అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన అనంతరం విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడారు. మత్తు పదార్థాల ఉత్పత్తి రవాణా వాటిని సేవించే వారిపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన వైఖరిని అవలంబించాలన్నారు. అప్పుడే అవలంబించాలన్న అప్పుడే మత్తు పదార్థాల నియంత్రణ జరుగుతుందన్నారు.

కఠిన చట్టాలను అమలు చేసి పూర్తిగా నియంత్రించాలని సుమన్ అన్నారు. మత్తు పదార్థాలకు  విద్యార్థినీ విద్యార్థులు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని భవిష్యత్తును  కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఐటీ సినీరంగంలో పనిచేస్తున్న మత్తు పదార్థాలకు అలవాటు పడి దానికి బానిసలై వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఈ బాధవారిని కన్న తల్లిదండ్రులు అనుభవిస్తూ సమాజంలోచులకన అవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

సింగపూర్ ప్రభుత్వం అమలు చేస్తున్న చట్టాలను భారత ప్రభుత్వం కూడా అమలు చేసి దేశ రక్షణ కోసం చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.   సమాజ సేవలో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న పేద పిల్లలకు ఉచితంగా మార్షల్ విద్యను తన శక్తి మేరకు అందిస్తున్నట్లు తెలిపారు.

నిజాంబాద్ జిల్లాలో తొమ్మిదో బటాలియన్ సమీపంలో ఉచితంగా మార్షల్ విద్యను నా అభిమాని నేర్పిస్తున్నానని చెప్పారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఉచిత అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం ఐదు సినిమాలు వివిధ ప్రాంతీయ భాషల్లో విడుదల కు సిద్ధంగా ఉన్నాయన్నారు.

సమాజానికి మేలు జరిగే ప్రతి కార్యక్రమంలో తన వంతు కృషి భాగస్వామ్యం ఉంటుందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల గురించి  ప్రశ్నించగా తాను ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయడం లేదని మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి నా  తోడ్పాటు ఉంటుందన్నారు. ప్రభుత్వాలు ప్రజల మేలు కోసం కఠినమైన చట్టాలను తీసుకువచ్చి అందరికీ ఒకే న్యాయం అమలు చేయాలని ఆయన కోరారు.