జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, జనవరి 30 : జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఉమ్మడి వరంగల్ -ఖమ్మం -నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక పై అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి వెబెక్స్ ద్వారా ఆర్డీఓ లతో,తహసీల్దార్ లతో , ఎంపిడిఓ లతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ని జనవరి 29 నాడు విడుదల చేయడంతో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని కలేక్టర్ తెలిపారు. ఫిబ్రవరి 3 నాడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల, 10న నామినేషన్ ల ముగింపు,11న నామినేషన్లు స్క్రూటినీ, ఉపసంహరణకు 13 చివరి రోజు అని తెలిపారు.
అలాగే ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ , మార్చి 3 నాడు ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. జిల్లాలో 2679 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని,జిల్లాలో మండలానికి ఒక్కటి చొప్పున 23 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తన నియమావళి జాగ్రత్తగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఓ వివి అప్పారావు, డిపిఓ నారాయణ రెడ్డి, ఎలక్షన్ సూపరిమేటెండెంట్ శ్రీనివాసరాజు, ఎలక్షన్ డిటి వేణు,ఆర్డీఓలు, తహసీల్దార్‌లు, ఎంపిడిఓలు పాల్గొన్నారు.