calender_icon.png 19 April, 2025 | 7:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు నిర్మూలన కోసం కఠినమైన నిర్ణయాలు: మంత్రి జూపల్లి

16-04-2025 08:36:34 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో కృతిమ కల్తీ కల్లు నిర్మూలన కోసం కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) అన్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నాసురూల్లాబాద్ మండలం దుర్గి, అంకోల్, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు సేవించి వందమందికి పైగా అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి సీరియస్ వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు సంబంధిత ఎక్సైజ్ ఉన్నతాధికారులతో మాట్లాడి కల్తీకల్లును అరికట్టాలని లేకుంటే కఠినమైన యాక్టు కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర స్థాయి అధికారుల ఆదేశాల మేరకు కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

బుధవారం నిజాంబాద్ లో వివిధ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎక్సైజ్ శాఖ పనితీరుపై సమీక్షించారు. కామారెడ్డి జిల్లాలో కల్తీకల్లు బారినపడి పేద ప్రజలు 100 మంది పైగా అస్వస్థతకు గురైన సంఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ అయినట్లు వెల్లడించారు. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం మాడుతున్న కల్తీ కల్లు విక్రయ దారులపై కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జాబ్ చేయడంతో రాష్ట్రస్థాయి ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ ఉమ్మడి జిల్లా స్థాయి ఎక్సైజ్ టాక్స్ ఫోర్స్ బృందాలు ఏర్పాటుచేసి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కల్తీకల్లు అరికట్టేందుకు క్షేత్రస్థాయిలో బృందాల ఏర్పాటు చేసి కల్తీ కల్లు శాంపిల్స్ సేకరించి ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు.

అనుమతి లేని కల్తీ కల్లు దుకాణాలను ముస్తే దారులు మూసివేసి కేసులు నమోదు కాకుండా చూసుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ప్రతిరోజు ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ ఆరు బృందాలు జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ కల్తీ కల్లు అరికట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులు సైతం కల్తీకల్లు అరికట్టేందుకు ముమ్మర ప్రయత్నాలు చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ మత్తుకు యువత అలవాటు కాకుండా నియంత్రించాలని ఉద్దేశంతో కళాశాలలో సైతం యాంటీ డ్రగ్స్ పై అవగాహన సదస్సు లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎవరెన్ని ఒత్తిడిలు చేసిన తమ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం యాంటీ డ్రగ్స్ ను అరికట్టలేక సినీ పరిశ్రమ వారికి యువతకు కళాశాలలో సైతం డ్రగ్స్ అమ్మకాలు చేపట్టి యువతను మత్తుకు బానిసలుగా చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్తు మందును డ్రగ్స్ ను గంజాయిని నియంత్రించాలని ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని కళాశాలలో విద్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. కల్తీ కళ్ళు నియంత్రణకు డ్రగ్స్ నియంత్రణకు గంజాయి నియంత్రణకు రాష్ట్ర ప్రజలు యువకులు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించాలని కోరారు.