calender_icon.png 3 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి

02-02-2025 12:00:00 AM

రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి

కరీంనగర్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): త్వరలో జరగనున్న గ్రాడ్యుయేట్,  టీచ ర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని, ఎన్నికలు ప్రశాంతం గా సాగేలా అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ర్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

శనివారం సాయంత్రం హైదరాబాద్ నుండి రాష్ర్ట ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి, జాయింట్ సీఈఓ లోకేష్ కుమార్, డిప్యూటీ సీఈవో సత్యవా ణితో కలిసి గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల పై  జిల్లా కలెక్టర్లతో  వీడి యో సమావేశం ద్వారా సమీక్షించారు. కరీం నగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్ లక్ష్మి కిరణ్ తో  కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్లో  పాల్గొన్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యం లో ఎన్నికలు జరిగే  జిల్లాల వ్యాప్తంగా ఎన్ని కల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అ మలు చేయాలని, 24 గంటలు, 48 గంట లు, 72 గంటలలో తీసుకోవాల్సిన చర్యలపై రిపోర్ట్ అందించాలన్నారు. రాజకీయ పార్టీల కు సంబంధించిన హోర్డింగులుగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించాల ని,  ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధ నలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి తుది ఓటర్ల జాబితా తయారు చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీచర్స్, పట్టభ ద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఫిబ్రవరి 7 లోపు పరిష్కరించాలని సీఈఓ అధికారులకు ఆదేశించారు.  ఎమ్మెల్సీ ఎన్ని కల నేపథ్యంలో ప్రతి జిల్లాలో ఎంసిఎంసి  కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మీడియా లలో వచ్చే ప్రసారాలను పరిశీలించా లన్నారు.

ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కట్టుదిట్టంగా జరగాలని, ఎక్కడా ఎటువంటి అలసత్వం ఉండటానికి వీలు లేదన్నారు. పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ అవసరమైన వసతులు కల్పించాలని, ఫిబ్రవరి 27న ఉదయం 8 నుంచి సాయం త్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేసే సన్న ద్ధంగా ఉండాలని అన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంకు ప్రిసైడింగ్ అధికారి, 3 పోలింగ్ అధికారులు ఉండే విధంగా సిబ్బందిని గు ర్తించాలని అన్నారు. శాసన మండలి సభ్యు ల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయలేని మారుమూల ప్రాంతా ల్లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించవచ్చని అన్నారు.  ఎన్నికలు విధులు నిర్వహించే సిబ్బందికి సర్టిఫికెట్లు జారీ చేసి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలన్నారు. 

కరీంనగర్ జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. వీడి యో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. కరీంనగర్ జిల్లాలో 103 పోలింగ్ స్టేషన్లో ఉన్నాయని, జంబో బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగే లా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామ ని వివరించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా పక్కాగా ఏర్పాటు చేస్తున్నా మని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదన పు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, డిఆర్‌ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, కరీం నగర్ హుజురాబాద్ ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు అధికారులు పాల్గొన్నారు.