జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
సంగారెడ్డి, జనవరి 28 (విజయ క్రాంతి): ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్ల అధికారులకు ఆదేశాలు జాతి చేశారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ నిర్వహించిన ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.
ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి శానిటేషన్ సమస్య తలెత్తకుండా గ్రామపంచాయతీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు.మార్చి 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం 54 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మార్చ్ 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు జరిగే ప్రధాన పరీక్షలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు తెలిపారు.
ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో పరీక్షలకు 15వేల 984 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలకు 1681 మొత్తం 17665 మంది విద్యార్థులు, మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నట్లు, ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 17,057, ఒకేషనల్ పరీక్షలకు 1431 మొత్తం 18488 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3వ తేదీ నుండి ఫిబ్రవరి 22 వరకు జరగనున్నట్లు తెలిపారు. పరీక్షా సమయం మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ సెషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు రెండవ శనివారం, ఆదివారాలు సెలవు దినాలు కలుపుకొని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్, జిల్లా వైద్యాధికారి గాయత్రీ దేవి ,పోస్టల్ శాఖ సూపర్నెంట్ మురళి, ఆర్టీవో అరుణ, జిల్లాలోని వివిధ డివిజన్ల ఆర్డీవోలు, రెవెన్యూ అధికారులు, పోలీసు శాఖ, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.