calender_icon.png 6 March, 2025 | 9:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

06-03-2025 01:14:59 AM

 కలెక్టర్ బీ.సత్యప్రసాద్ 

 ఈనెల 10 నుంచి 22 వరకు బ్రహ్మోత్సవాలు 

ధర్మపురిలో ఏర్పాట్ల పరిశీలన, సమీక్ష 

జగిత్యాల, మార్చి 5 (విజయక్రాంతి): జిల్లాలోని సుప్రసిద్ధ ప్రాచీన దేవాలయం శ్రీధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు జగిత్యాల కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన కలెక్టర్ బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ నెల 10 నుండి 22,వరకు జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి అధికారులతో కలిసి సమీక్షించారు.

గోదావరి నది గాట్లను, భక్తులకు స్నానమాచరించే పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నది తీరాన భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్, చలవ పందిర్లు ఏర్పాటు చేసి, అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. మహిళలకు డ్రెస్ చేంజ్ రూములు, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్ , ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆలయ ప్రాంగణం ఆలయ పరిసరాలలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్’కుమార్ నూతనంగా ప్రతిపాదించిన శ్రీమట్టంలోని 4 ఎకరాల ఖాళీ స్థలంలో స్వామి వారి కళ్యాణానికి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. శ్రీవారి కళ్యాణానికి దేవాలయ శాఖ అనుమతితో కళ్యాణ వేదిక వద్ద కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత ఏడాది భక్తులు సుమారు 3లక్షల వరకు వచ్చారని, ఈ సారి సుమారు 4లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నందున కావాల్సిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేయాలని ఆయా శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అనంతరం ధర్మపురి మున్సిపల్ కార్యాలయాన్ని  అకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయాన్ని, పలు రికార్డులను, దరఖాస్తులను  పరిశీలించారు. ఎల్‌ఆ ర్‌ఎస్ దరఖాస్తులను పరిశీలించి, ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది ప్రాసెస్ చేయబడ్డది అనే వివరాలు తెలుసుకున్నారు. ఇంటి పన్ను వసూలు వివరాలను, నిధుల వినియోగాన్ని అడిగి తెలు సుకున్నారు. కచ్చితంగా 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో ధర్మ పురి ఆలయ ఈఓ శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, డిప్యూటీ ఎమ్మా ర్వో సుమన్, ఆర్డబ్ల్యూఎస్ ఈఇ, సంబంధిత శాఖల అధికారులు  పాల్గొన్నారు.