calender_icon.png 1 April, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంజాన్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

31-03-2025 01:47:55 AM

రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు 

యాదాద్రి భువనగిరి, మార్చి 30 (విజ య క్రాంతి): ముస్లిం సోదరులకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ నేడు జరుగు తున్న సందర్భంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రార్థనలు జరిపే ఈద్గాలు, ప్రార్థన మందిరాలు వద్ద జాగిలాలతో తనిఖీలు నిర్వహించామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ప్రకటించారు. ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక ప్రార్థనా స్థలాల వద్ద జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీస్ సిబ్బంది సూచించారు. అన్ని ప్రముఖ మసీదుల ప్రాంగణాల్లో వాహనాల నెంబర్ ప్లేట్ల చెకింగ్ వాహనం పత్రల చెకింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. భువనగిరి, యాదగిరిగుట్ట, మసీదులు ప్రార్థన స్థలాల వద్ద, సరూర్నగర్ దర్గా ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ బాలాపూర్ దర్గా వంటి ప్రాంతాల్లో యాంటీ సపోర్ట్ ఏజ్ చెక్ టీం, డాగ్ టీమ్ లతో అధికారులు తనిఖీలు నిర్వహించారు.