calender_icon.png 21 January, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుంటే కఠిన చర్యలు

21-01-2025 12:00:00 AM

 జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్

జగిత్యాల, జనవరి 20 (విజయక్రాంతి): ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా స్కూల్ బస్సు లను అక్రమంగా ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని జగిత్యాల ఎస్పీ అశోక్’కుమార్ హెచ్చరించారు. రోడ్డు భద్రతా మాసోత్సవా ల్లో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ లో భాగంగా స్కూల్ బస్సుల డ్రైవర్లకు, యజమానులకు జిల్లా కేంద్రంలో సోమవా రం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొ న్న ఎస్పీ అశోక్’కుమార్ మాట్లాడుతూ బడి పిల్లల భద్రతే మాకు ముఖ్యమని, రోడ్డు ప్రమాదాల నివారణలో అందరూ భాగస్వా ములు కావాలని సూచించారు. విద్యా సంస్థల ప్రతీ వాహనానికి రోడ్డు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ జారీచేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఉండాలని, లేనట్లయితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిం చారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్‌నెస్ గురించి, స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసు కోవాల్సిన జాగ్రత్తలపై యజమానులకు, డ్రైవర్లకు అవసరమైన ట్రాఫిక్, రోడ్ సేఫ్టీపై విషయాలపట్ల అవగాహన కల్పించారు. స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమా దం జరిగినా సంబంధిత డ్రైవరు, యాజమా న్యంపై  కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చ రించారు.

విద్యా సంస్థలు తమ వాహనాల కు రోడ్  ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారిచే జారీ చేయబడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేస్తూ ఉండాల న్నారు. స్కూల్ బస్ డ్రైవర్లు ట్రాఫిక్ నియ మాలను  పాటించాలని, ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనాలు నడపరాద న్నారు. 

చాలా వరకు రోడ్డు ప్రమాదాలు అతివేగంగా నడపడం వల్లనే జరుగుతున్నా యని, స్కూల్ బస్సుల్లో ప్రయాణించే వారి లో చిన్న పిల్లలే ఉంటారు కాబట్టి వారి పట్ల చాలా జాగ్రత్త వహించాలని ఎస్పీ సూచిం చారు. బస్సుకు సంబంధించి అన్ని వాహన పత్రాలు  కల్గివుండాలని, బస్సు సరైన కండీ షన్లో ఉందో లేదో ముందే జాగ్రత్తపడా లన్నారు.

బస్సు బ్రేక్, లైట్స్, ఇండికేటర్స్, పార్కింగ్ లైట్స్, వైపర్స్ తదితర ముఖ్యమైన పరికరాలు పనిచేస్తున్నాయో లేదో చెక్ చూసుకోవాలని ఎస్పీ అశోక్’కుమార్ సూ చించారు. ఈ సందర్భంగా పలు స్కూల్ వా హనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, వారు సదరు ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అని ఎస్పీ స్వయంగా పరిశీలించారు.

నియమాలు పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసు కోవాల్సిందిగా సంబంధిత ఆర్టిఏ అధికారు లను ఎస్పీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, జిల్లా రవాణా అధికారి  శ్రీనివాస్, ఆర్‌ఐ వేణు, ట్రస్మా జిల్లా అధ్య క్షులు  శ్రీధర్’రావు, ఎస్సైలు సుధాకర్, మల్లే శం, గీత, రవాణా శాఖ అధికారులు, పోలీస్ సిబ్బంది, స్కూల్ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.