calender_icon.png 17 November, 2024 | 7:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిపితే కఠిన చర్యలు

17-11-2024 06:00:26 PM

కోదాడ (విజయక్రాంతి): వాహనాదారులు లారీలు, ట్రాక్టర్లు, కార్లు ద్విచక్రవాహనాలు రోడ్డుకు అడ్డంగ నిలుపుతున్నారని అలా ఇష్టానుసారంగా వాహనాలను నిలిపితే చట్టపైన చర్యలు తీసుకుంటామని మండల సబ్ ఇన్స్పెక్టర్ జి.అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు నిర్లక్ష్యంగా రోడ్డుకి అడ్డంగా వాహనాలు నిలిపి రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతున్నారని ట్రాక్టర్లు, కార్లు, లారీలు, వరికోత మిషన్లు, ద్విచక్రవాహనాల ద్వారా ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని ఆయన తెలిపారు. వరికోత మిషన్ డ్రైవర్లు విద్యుత్ లైన్ వైర్లను చూసుకోవాలని రాత్రి సమయంలో వరి కోతను ఆపి మరుసటి రోజు కొనసాగించాలన్నారు. రైతులు వడ్ల బస్తాలు వరి ధాన్యాన్ని రోడ్డుపైన పోయవద్దన్నారు. నిర్లక్ష్యంగా మద్యం మత్తులో వాహనాలు నడపడం రాత్రి వేళలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అతివేగంగా వాహనాలు నడపవద్దని కుటుంబానికి దూరం కావద్దను సూచించారు.