వెల్దండ, జనవరి 2 : ఉపాధ్యాయులు పాఠశాలకు సమయపాలన పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో రమేష్ కుమార్ హెచ్చరించారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల హాస్టల్, ఆదర్శ పాఠశాలను, బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదుల్లోని కూరగాయలను, భోజనాన్ని పరిశీలించి మాట్లాడారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. చదువులో విద్యార్థుల సామర్థ్యాన్ని పరీక్షించారు. పదవ తరగతి, ఇంటర్మిడియేట్ పబ్లిక్ పరీక్షలలో మెరుగైన ఉత్తీర్ణత ఫలితాలను సాధించడానికి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రణాళికలను రూపొదించి వాటి అమలు చేసుకోవాలని సూచించారు. ఫలితాలు తక్కువ వచ్చిన పాఠశాలను, కళాశాలల ఉపాధ్యాయులపై , ప్రధానోపాధ్యాయులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట ఎంఈఓ చంద్రుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుగుణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.