calender_icon.png 7 October, 2024 | 11:57 PM

చెరువులను, కాల్వలను కబ్జా చేస్తే కఠిన చర్యలు

04-09-2024 02:26:08 AM

ఇరిగేషన్ డీఈ కుమార్

లక్షెట్టిపేట, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): చెరువులను, పంట కాలువలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ డీఈ కుమార్ హెచ్చరించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల చెరువు ద్వారా ప్రవహించే కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి ఇటిక్యాల చెరువు ఆక్రమణ తీరును పరిశీలిస్తున్నామని, చెరువు ఎఫ్‌టీఎల్ లెవల్‌ను గుర్తించి ట్రెంచ్ వేస్తామని చెప్పారు. చెరువు తూములు, పంట కాలవలు కబ్జా చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. కొందరు రియల్టర్లు చెరువులో మట్టి పోస్తూ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారని, ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతామని వెల్లడించారు. డీఈ వెంట రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖల అధికారులున్నారు.