12-03-2025 12:59:03 AM
కేశనపల్లిలో ప్రజలకు అవగాహన సదస్సులో మంథని సీఐ రాజు
ముత్తారం మార్చి 11 (విజయక్రాంతి) మంథని సర్కిల్లోని గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని ముత్తారం మండలంలోని కేశనపల్లిలో మంగళవారం సాయంత్రం గ్రామ ప్రజలకు అవగాహన సదస్సులో మంథని సిఐ రాజు హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐ రాజు ముత్తారం ఎస్త్స్ర నరేష్ తో కలిసి మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా శాంతి భద్రతలకు ఆటంకం కల్పిస్తే వెంటనే 100కు డయల్ చేయాలని సూచించారు.
ఎవరైనా ఫోన్ లో మీ ఓటీపీ చెప్పండి, లేక మీ ఎకౌంటు నంబర్ చెప్పండి అని అడుగుతే ఎలాంటి సమాచారం ఇవ్వద్దని, సైబర్ నెరగళ్లు వుచ్చులో పడద్దని సూచించారు. ్ర గ్రామాల్లో పోలీస్ నిరంతరం నిఘా ఉంచి పర్యవేక్షిస్తున్నామని, ఏ చిన్న సమస్య ప్రజలకు కలిగిన వెంటనే తమకు గానీ100 కు కానీ ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటామని సిఐ భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, సిబ్బంది ఉన్నారు.