- ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం
- వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర
- ఎంసీహెచ్‌హెచ్‌ఆర్డీలో ఈ ఔషధి వర్క్‌షాప్
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాం తి): రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, వైద్యులు, సిబ్బంది అడిగిన అన్ని రకాల పరికరాలను, ఔషధాలను సిద్ధంగా ఉంచామని.. ఇలాంటి పరి స్థితుల్లో రోగులు ఇబ్బందులు పడ్డట్టు తమ కు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు.
నిత్యం ప్రజలతో ముడిపడి ఉండే ఈ శాఖ లో పనిచేస్తున్న వారంతా అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ఎంసీచ్‌హెచ్‌ఆర్డీలో ఫార్మసీ, ఈణి-ఔషధి వర్క్ షాపును మంత్రి ప్రారంభించారు. ఔషాధాలకు సంబంధించి అందరి సలహా లు, సూచనలు తీసుకున్నామని.. అడిగినట్టు హెచ్‌ఆర్, ఎక్విప్‌మెంట్ అన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు.
ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ మెడిసినల్ స్టోర్స్, మెడిసిన్ డిస్ట్రిబ్యూషన్‌కు వాహనాలు సమకూర్చినట్టు తెలిపారు. అన్ని సీఎంఎస్‌లు, ఫార్మసీ స్టోర్లలో కంప్యూటర్లు, ఇంటర్నెట్ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు. కోరిన అన్ని మెడిసిన్ ఇస్తు న్నా మందులు లేవ ని వార్తలు వస్తున్నాయని.. దీనికి కార ణం ఏంటో హాస్పిటల్ సూపరిం టెండెంట్లు, ఉన్నతాధికారులు గుర్తించాలని సూచించారు.
ఎక్క డైతే నిర్లక్షం జరుగుతుందో అక్కడ సంబంధి త అధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడిసిన్‌కు సంబంధిం చిన అంశంపై రెగ్యులర్ మానిటరింగ్ కోసం ప్రతి జిల్లాలోనూ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నామని తెలిపారు. డీఎం హెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, జిల్లాలోని టీచింగ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కమిటీలో ఉంటారని వెల్లడించారు. అన్ని హాస్పిటల్స్‌లో మెడిసిన్ ఉండేలా కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు.
సమస్యలు ఏవైనా ఉంటే ఫార్మసిస్టులు కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఫార్మసిస్టులు, డాక్టర్లు, హాస్పిటల్ సూపరింటెండెంట్లు కోఆర్డినేషన్‌తో పని చేయాలని సూచించారు. అందు బాటులో ఉన్న మెడిసిన్ వివరాలను డాక్ట ర్లు, ఈ-ఔషధి పోర్టల్‌లో చెక్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు.
సూపరిం టెండెంట్లు, ఆర్‌ఎంవోలు నిత్యం ఉదయాన్నే హాస్పిటల్‌లోని ఫార్మసీ స్టోర్‌ను తనిఖీ చేయాలన్నారు. వర్క్ షాప్‌లో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, కమిషనర్ ఆర్వీ కర్ణన్, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ హేమంత్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, డీహెచ్ రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.