12-02-2025 12:00:00 AM
ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి
మునుగోడు/గట్టుప్పల్, ఫిబ్రవరి 11 : అంగన్వాడీ టీచర్లు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి హెచ్చరించారు. మంగళవా రం ఆమె గట్టుప్పల్, వెల్మకన్నే అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు.
మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారులకు ఆట పాటలతో బోధించాలని చెప్పాలని చెప్పా రు. కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పోషన్ యాప్లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్లు శివేష, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.