calender_icon.png 23 December, 2024 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెగెటివ్ పోస్టులు షేర్ చేస్తే కఠిన చర్యలు

23-12-2024 02:26:44 AM

నటుడు అల్లు అర్జున్ హెచ్చరిక 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 22 (విజయక్రాంతి): అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సీఎం రేవంత్‌రెడ్డిని, తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీంతో కొంత మందిపై కేసు లు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఫ్యాన్స్ ముసుగులో పోస్టులు చేస్తున్నవారికి తన అభిమానులు దూరంగా ఉండాలని కోరుతూ ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘నా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను బాధ్యతాయుతంగా వ్యక్తపరచాలి. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా పోస్టులు షేర్ చేయవద్దని నా విన్నపం. ఫ్యాన్స్ ముసుగులో కొన్ని రోజులుగా ఫేక్ ఐడీలు, ఫేక్ ప్రొ ఫైల్స్‌తో పోస్టులు షేర్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నెగెటివ్ పోస్టులు షేర్ చేస్తున్న వారికి నా అభిమానులు దూరంగా ఉండాలి’ అని  ఆ ప్రకటనలో పేర్కొన్నారు.