05-04-2025 01:05:46 AM
కలెక్టర్ గౌతమ్
మేడ్చల్, ఏప్రిల్ 4 (విజయ క్రాంతి): సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ గౌతం స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో సన్న బియ్యం పంపిణీ పై పౌరసరఫరాల జిల్లా మేనేజర్ సుగుణబాయి, కాంట్రాక్టర్, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బియ్యం రవాణాకు స్టేజి 1 కాంట్రాక్టర్ అదనంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
బియ్యం పంపిణీలో ఆలస్యం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. ఇతర జిల్లాల నుంచి మేడ్చల్ జిల్లాకు బియ్యం సకాలంలో రావడానికి డిప్యూటీ తహసిల్దారులకు బాధ్యతలు అప్పగించామన్నారు. సంబంధిత అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి సకాలంలో బియ్యం పంపిణీ జరిగేలా చూడాలన్నారు.