calender_icon.png 12 February, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు

11-02-2025 11:01:15 PM

ఎస్పీ డివి శ్రీనివాసరావు..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో అక్రమ దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డివి శ్రీనివాసరావు హెచ్చరించారు. సిర్పూర్ టి పోలీస్ స్టేషన్ పరిధిలో 208 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం కాగజ్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ మూడు వాహనాలలో మహారాష్ట్రకు పిడిఎస్ బియ్యం తరలిస్తున్నట్టుగా వచ్చిన పక్కా సమాచారం మేరకు సిర్పూర్ సిఐ తన సిబ్బందితో హుడికిలి చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యం విలువ దాదాపుగా రూ: 7.48 లక్షలు ఉంటుందని తెలిపారు. క్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. స్వాదిన పచ్చుకున్న బియ్యం రేషన్ డీలర్ షాపుల నుండి వచ్చినట్లుగా తెలుస్తుందని పూర్తి విచారణ చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై మరింత కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని తెలిపారు. అక్రమ బియ్యం పట్టుకున్న ఎస్ఐతో పాటు సిబ్బందినీ అభినందిచి రివార్డు అందజేశారు.