29-03-2025 06:30:11 PM
పట్టణ సిఐ శశిధర్ రెడ్డి..
మందమర్రి (విజయక్రాంతి): సర్కిల్ పరిధిలోని మందమర్రి, రామకృష్ణాపూర్, కాసిపేట, దేవపూర్ పోలీస్ స్టేషన్ ల పరిదిలో వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని సిఐ కె శశిధర్ రెడ్డి హెచ్చరించారు. పట్టణ పోలీస్ స్టేషన్లో సర్కిల్ పరిధిలోని బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. మద్యం సేవించి వాహనం నడపడం చాలా ప్రమాదకరం ఆన్నారు. మద్యం మూలంగా మనం చూస్తున్న దానిపై కూడా ప్రభావం చూపుతుందని ఆన్నారు. మానవ మస్తిష్కాన్ని, నాడీ వ్యవస్థను క్రమంగా ప్రభావితం చేసే మద్యంను సేవించి వాహనాలు నడపవద్దని కోరారు.
పోలీసులు వివిధ రూపాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న ప్పటికీ కొంతమంది పట్టించుకోకుండా ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి, చిన్న చిన్న విషయాలలో గొడవలు పెట్టుకున్న వారిపై, రౌడీ యాక్టివిటీస్ జరిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్, రామకృష్ణాపూర్ ఎస్ ఐ రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.