calender_icon.png 11 February, 2025 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్‌వాడీ టీచర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు..

11-02-2025 08:00:44 PM

ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి...

మునుగోడు: మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలనీ ఐసీడీఎస్ పీడీ కృష్ణవేణి అంగన్వాడీ కేంద్రాల టీచర్లను హెచ్చరించారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని గట్టుప్పల్, వెల్మకన్నే అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు ప్రీస్కూల్ కార్యక్రమాలు చేయటాన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు లేకపోయినా, నిర్లక్ష్యం వ్యవహరించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కేంద్రాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచనలు చేశారు. పిల్లలకి అందించే ఆహార వివరాల పోశన్ యాప్ ను చెక్ చేశారు. ప్రీ స్కూల్ పిల్లలు చేసిన కార్యక్రమాల పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏసీడీపీఓ వెంకటమ్మ, సూపర్‌వైజర్లు శివేష, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.