13-02-2025 01:07:55 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): ఇంటర్ విద్యాశాఖ షెడ్యూల్ ప్రకటించడానికి ముందు రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేపట్టొద్దని రాష్ట్రంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా చేపడితే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈమేర కు బుధవారం కృష్ణ ఆదిత్య ఒక ప్రకటన విడుదల చేశారు. 2025 విద్యా సంవత్సరానికి అఫిలియేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదని, అది పూర్తయిన తర్వాత గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో పొందుపర్చుతామన్నారు. ఆ జాబితాకు అనుగుణంగా తల్లిదండ్రులు పిల్లలకు అడ్మిషన్లు తీసుకోవాలని కోరారు