27-03-2025 01:49:34 AM
కోదాడ, మార్చి 26: ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తూ ఆటోలను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామనీ ట్రాఫిక్ ఎస్త్స్ర మల్లేష్ హెచ్చరించారు. పట్టణంలోని బిఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్ వద్ద ఆటో డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రాఫిక్ ఎస్సై అవగాహన కల్పించారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలను కట్టడి చేసేం దుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్‌ఐ ఖయ్యూం, సిబ్బంది పాల్గొన్నారు