calender_icon.png 19 April, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ విత్తనాలు, మందులు అందిస్తే కఠిన చర్యలు

17-04-2025 01:43:28 AM

జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్

కామారెడ్డి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రైతులకు నష్టం కలిగించే చర్యలకు పాల్పడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి తిరుమల ప్రసాద్ అఅన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం లోని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ తిరుమల ప్రసాద్ తన కార్యాలయంలో విజయ క్రాంతి ప్రతినిధితో మాట్లాడారు.

కామారెడ్డి జిల్లాలో కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులు ,కల్తీ క్రిమిసంహారక మందులు, పలుచోట్ల పేద రైతులకు వ్యాపారులు అంటగడుతున్నార ని దీంతో పేదరైతులు తీవ్రంగా పెట్టుబడులతో పాటు విత్తనాల కొనుగోలు చేసిన ధరలు కూడా నష్టపోతున్నారని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ లో విజయక్రాంతి ప్రతినిధి అడగగా, అలాంటి సంఘటనలు తమ దృష్టికి రాలేదని తెలిపారు.

నకిలీ విత్తనాలు గాని నకిలీ ఎరువులు గాని నకిలీ మందులు గాని రైతులకు విగ్రహించిన ట్లయితే వ్యాపారం లైసెన్స్ రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గతంలో లాగా వ్యాపారులు కూడా కల్తీ విత్తనాలు అమ్మడం లేదని తెలిపారు. విత్తనాలు గాని ఎరువులు గాని రసాయనిక మందులు కొనుగోలు చేసే తప్పకుండా వ్యాపారులు బిల్లులు ఇస్తున్నారని తెలిపారు.

ఏ వ్యాపారైన బిల్లులు ఇవ్వకుంటే స్థానిక వ్యవసాయ అధికారుల దృష్టికి తేవాలని వారు పట్టించుకోకుంటే జిల్లా కార్యాలయంకు వచ్చి తన దృష్టికి తేవచ్చు అని తెలిపారు. ఎక్కువ దిగుబడి వస్తున్నా కానీ మొక్కజొన్నలను ఎక్కువ ధరకు విత్తనాలను రైతులకంటగాడుతున్నారని రైతులు కోరుకుంటున్నారని జెడి ఏ దృష్టికి తీసుకురాగా అలాంటి సంఘటనలు జరగడంలేదని కొట్టిపారేశారు.

ఏవైనా సంఘటనలు ఉంటే నేరుగా తెచ్చి చూస్తే తప్పకుండా ఆ దుకాణాలను సీజ్ చేస్తామని ఆ వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు .  ఎరువుల వ్యాపారులు అధిక ధరలకు ఎరువులను విక్రయించిన లైసెన్స్ సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

రైతులు ఎరువులు క్రిమిసంహారక మందులు విత్తనాలు తీసుకునేటప్పుడు బాధ్యతగా రసీదు తీసుకోవాలని ఒకవేళ షాప్ యజమానులు రసీదు ఇవ్వనట్లయితే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన రైతులను కోరారు. ఫర్టిలైజర్ షాప్ యజమానులు కూడా ప్రతిరోజు ఎరువుల ధరల పట్టికను బోర్డుపై రాయాలని ఆయన సూచించారు. 

జిల్లాలో 432 ఫర్టిలైజర్ షాప్ లు ఉన్నాయని, కామారెడ్డి పట్టణంలో 20 షాపులు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎరువుల బస్తాలపై క్రిమిసంహారక పురుగుమందుల  డబ్బాలపై ఉత్పత్తి చేసిన కంపెనీ పేరు ఉన్న వాటికి మాత్రమే రైతులు కొనుగోలు చేయాలని ఆయన రైతులకు సూచించారు. రసీదు తప్పకుండా తీసుకోవాలని కోరారు. ఎరువుల దుకాణం పెట్టుకునేవారు ప్రభుత్వానికి 1500 రూపాయలు  చలాన్ రూపంలో చెల్లించి లైసెన్స్ పొంది దుకాణం నడుపుకోవాలని తెలిపారు.

ఈ సీజన్లో సుమారు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పత్తి రైతులు ఉత్పత్తి చేయడం జరిగిందని ప్రభుత్వం క్వింటాలకు 7779 రూపాయలు చెల్లించిందన్నారు.  రభి సీజన్లో రైతులు 3.2 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించడం జరిగిందన్నారు. జిల్లాలో ఒకటి పాయింట్ 8 లక్షల  60 వేల ఎక రాలలో పంటలు పండిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా వరి ధాన్యం పత్తి ,చెరుకు, జొన్నలు,ఎక్కువగా రైతులు పంటలు పండిస్తున్నట్లు చెప్పారు.

జిల్లాలోని 25 మండలాల్లోమండలానికి ఒక్కరి చొప్పున్నా 25 మంది మండల వ్యవసాయ శాఖ అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు  మండలానికి నలు గురు అగ్రికల్చర్ ఎక్సటేషన్ అధికారులు పనిచేస్తున్నారని ఉద్యోగుల కొర త లేదని చెప్పారు. జిల్లాలో నలుగురు ఏడి ఏలు ఉన్నారని కామారెడ్డి,బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద ప్రాంతాల్లో ఉన్న ఏ డి ఏ లు రైతులకు అందుబాటులో ఉన్నారని తెలిపారు. వారి పరిధిలో యేసయ్య అధికారులు వ్యవసాయ విస్తీర్ణ  అధికారులు ప్రభుత్వం రైతులకు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందే విధంగా విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారని ఆయన చెప్పారు. 

రైతులు ఎరువులు పురుగుల మందులు కొనుగోలు చేసే టప్పుడు షాపు యజమాని వద్ద రసీదు తప్పకుండా తీసుకోవాలని నకిలీ విత్తనాలు. ఎరువులు, ప్రభుత్వం గుర్తించలేని క్రిమిసంహారక మందులు విక్రయిస్తే చట్టానికి లోబడి కేసులు నమోదు చేయడం జరుగుతుందని దుకాణ  యజమానులను ఆయన హెచ్చరించారు.కాగా ఇప్పటివరకు ఒక్క కేసు నమోదు కాలేదని తేలిపారు. ఎరువులు,విత్తనాలు, క్రిమిసంహారక మందుల షాపు యజ మానుల నుండి అధికారులకు ముడుపులు ముట్టడం వల్లనే ఏ ఒక్కరిపై కేసు నమోదు కాలేదని విశ్వసనీయ సమాచారం. జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని పలువురు షాప్ యజమానులు  అంటున్నారు.