calender_icon.png 6 February, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యభిచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు

06-02-2025 12:00:00 AM

సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి 

నిజామాబాద్ ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరి స్తామని ముఖ్యంగా వ్యభిచారం నిర్వహించే వారితో పాటు అందుకు సహకరించిన నేరంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టపరంగా అరెస్ట్ చేసి కఠినచర్యలు తీసు కుంటామని సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి హెచ్చరించారు.

ఈ మేరకు బుధవారం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. చదువుకునే అమ్మాయిలను కొందరు వ్యభిచార కూపంలోకి లాగుతు న్నారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాల న్నారు.

ఆర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకొని అమాయక విద్యార్థినీయులను యువతులను మహిళలను టార్గెట్ చేసి మోసగాళ్లు వాడిని మభ్యపెట్టి లాగుతు న్నారనీ ఇటువంటి నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అప్రమత్తంగా ఉండి ఈ మోసకారుల బారిన పడకుండా ఉండాలని ఆయన హెచ్చరించారు. చట్ట విరుద్ధమైన కార్యకలా పాలు నిర్వహిస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారమిచ్చిన వారి వివరాలు బయటికి ఇవ్వబోమని ఆయన హామీ ఇచ్చారు.