calender_icon.png 29 March, 2025 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు : ఇల్లందు డీఎస్పీ

26-03-2025 01:29:16 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): అసాంఘిక చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా సహించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు డీఎస్పీ ఎన్. చంద్రభాను(Yellandu DSP Chandra Bhanu) హెచ్చరించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ కాంటాక్ట్లో భాగంగా బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  టేకులపల్లి మండలం గొల్యాతండ పంచాయతీ పరిధిలోని వాగొడ్డుతండా  బి కాలనితండాలలో తెల్లవారుజామున స్నిపర్ డాగ్ తో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. మాదక ద్రవ్యాలు సేవించడం, గంజాయి విక్రయాలు చేయడం, ఐపీఎల్ బెట్టింగ్ పాల్పడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎలాంటి పత్రాలు లేని 36 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక మాజిక్ను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి సీఐ తాటి పాముల సురేష్, బొడు, ఆళ్లపల్లి ఎస్ఐలు పోగుల సురేష్, పొడి శెట్టి శ్రీకాంత్, ఈ. రతీష్ తో పాటు సుమారు 60 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.