నారాయణపేట. జనవరి 11ః ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమంలో భాగంగా నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం 37 మంది బాలా కార్మికులను, 17 బాలురు, 20 బాలికలను ఆపరేషన్ స్త్మ్రల్ టీం పట్టుకోవడం జరిగిందని వారిని షెల్టర్ హోమ్ కి తరలించడం జరిగిందని తెలిపారు.
అనంతరం చైల్ వెల్ఫేర్ కమిటీ ద్వారా వారికి కౌన్సెలింగ్ ఇచ్చి విద్యార్థులను స్కూల్లోకి పంపించడం జరుగుతుందని పనిలో పెట్టుకున్న వారికి జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. నారాయణపేట జిల్లాలో ఎవరైనా 18 సంవత్సరాలు లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారు హెచ్చరించారు.
ప్రతి ఒక్కరి జీవితంలో బాల్యం అమూల్యమైందని దానిని అనుభవించటం ప్రతి పౌరుని యొక్క హక్కు అని కొంత మంది క్షినికావేశంలో కొందరు పిల్లలు తొందరపాటుతో చిన్న చిన్న విషయాలకి తల్లిదండ్రులను విడిచి ఇంటికి దూరంగా ఉంటున్నారని ఇట్టి అవకాశాన్ని ఆసరాగా తీసుకుని కొంత మంది వారిని ప్రమాదకర పనులు చేయిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారని అలాంటి వారిని గుర్తించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
తప్పిపోయిన పిల్లలను వెతికి దర్పన్ అప్లికేషన్ ద్వారా వారిని గుర్తించి చైల్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరు పరిచి వారికి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి చదువుకునెల చూస్తామని తెలిపారు. నారాయణపేట జిల్లా పరిధిలో ఎవరైనా చిన్న పిల్లల్ని పనులకు పంపించిన, వెట్టిచాకిరి చేయించిన వారి సమాచారాన్ని ప్రజలు 1098 కి గాని లేదా112, డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని ఎస్పి కోరారు.