calender_icon.png 27 March, 2025 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎల్‌లో బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు

24-03-2025 12:40:43 AM

 ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు

ఇబ్రహీంపట్నం, మార్చి 23 (విజయక్రాంతి): ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెదలైన సందర్బంగా ఐపీల్ లో బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవనీ ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు అన్నారు.

చాలామంది యువత ఇజీ మనీ కి అలవాటు పడి ఐపీల్ బెట్టింగ్ పెట్టి డబ్బులు సంపాదించాలనా ఆశతో డబ్బులు లేకపోయినా అప్పుగా తీసుకోని ఐపీల్ లో బెట్టింగ్ పెడుతూ, అప్పు కట్టలేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటారని, గతంలో కూడా ఐపీల్ లో బెట్టింగ్ లకు పాల్పడి అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చాలా జరిగాయాన్నారు. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా ఐపీల్ బెట్టింగ్ పాల్పడితే తమకు సమాచారం అందించాలని అయన కోరారు.