calender_icon.png 11 April, 2025 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు

04-04-2025 06:31:03 PM

జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,(విజయ క్రాంతి): జిల్లాలో ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంథని మండలం దుబ్బపల్లి గ్రామ శివారులో సర్వే నెంబర్ 173లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగిందని, ఏప్రిల్ 3న ఆవునూరు భాను చందర్  ప్రభుత్వ భూమిలో ఉన్న పల్లె ప్రకృతి వనంలో 4 ఎకరాల స్థలంలో చెట్లను కొట్టివేసి చదును చేసి పొలం గట్టు వేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మంథని మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ ఫిర్యాదు పై పోలీసులు సంబంధిత భాను చందర్ పై బిఎన్ఎస్ సెక్షన్ 324(4), 329(3) & సెక్షన్ 3 ఆఫ్ పిడిపిపి యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగిందని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి చేయాలని చూస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.