15-03-2025 12:00:00 AM
మేడిపల్లి తహసీల్దార్ హసీనా
మేడిపల్లి,మార్చి14(విజయక్రాంతి): ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హసీనా అన్నారు. మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపల్ కార్పోరేషన్ పరీధిలోని సర్వే నంబర్ 63/28 నుండి 63/39 వరకు గల ప్రభుత్వ భూమిని అక్రమించి కొందరు ఇంటి నిర్మాణం చేశారు.
ప్రభుత్వ భూమిని అక్రమణపై ఫీర్యాదుతో తహసీల్దార్ ఆదేశాల మేరకు శుక్రవారం ఆర్‌ఐ రాకేష్ పరిశీలించి ఇంటిని కూల్చివేశారు. దీంతో అక్రమదారులైన రవికుమార్,పుష్ప జెసీబీకి అడ్డు వచ్చి దుర్బాషలాడుతూ ఆర్‌ఐ,రెవిన్యూ సిబ్బందిని అడ్డగించారు. దీంతో తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఫీర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేశామని మేడిపల్లి ఇన్స్పెక్టర్ గొవింద్ రెడ్డి తెలిపారు.
ఈ సందర్బంగా తహసీల్దార్ హసీనా మాట్లాడుతూ అక్రమంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. కాగా కేవలం కొన్ని అక్రమనిర్మా ణాలపై తూతూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకొని మిగిలిన వాటిపై అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి చర్యలు తీసుకోకపోవడంతో అధికారులు ప్రజల్లోవిశ్వసనీయత కోల్పోతున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.