ఏఎస్పిటి చిత్త రంజన్
పశువుల అడ్డలపై మఫ్టిలో ఎఎస్పి దాడులు
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): పశువులను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏ ఎస్ పి చిత్తరంజన్ హెచ్చరించారు. సోమవారం వాంకిడి మండలం మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని గోయగాం, చిచ్చుపల్లి గ్రామ శివారులో ఎఎస్పీ మఫ్టీలో ద్విచక్ర వాహనంపై పశువుల అడ్డాలపై ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పలు ప్రాంతాలలో వంద పశువులకు పైగా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న పశువులను స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. పశువుల కు వైద్య పరీక్షలు చేపట్టినట్లు వివరించారు. అక్రమంగా పశువులను తరలించేందుకు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జీవాలను వాహనాలలో కుక్కి అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవాణా చేస్తూ రెండుసార్లు పట్టుబడ్డ వ్యక్తులపై పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలని ఎస్సైని ఆదేశించారు. వాంకిడి పోలీస్ స్టేషన్ కు కేవలం మూడు కిలోమీటర్ల పరిధిలో పశువుల అక్రమ రవాణా దందా జోరుగా సాగుతున్న తీరును చూసి ఏఎస్పీ అసహనం వ్యక్తం చేశారు.