హైదరాబాద్: లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగించే విధంగా ఎవరు చేసినా కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అరాచకం సృష్టిద్దాం అంటే తప్పకుండా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. లా అండ్ ఆర్డర్ భంగం కలిగించే వారు ఎవరున్నా, భంగం కలిగించే ప్రయత్నం చేసిన తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు.