calender_icon.png 28 November, 2024 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘సామాజిక బహిష్కరణ’పై కఠిన చర్యలు తీసుకోవాలి

28-11-2024 02:16:49 AM

డీజీపీకి బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ లేఖ

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): బీసీ వర్గాలను సామా జిక బహిష్కరణ చేస్తున్న ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ జితేందర్‌ను బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్ కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన డీజీపీకి లేఖ రాశా రు. రాష్ట్రంలో నిర్వహించిన బహిరంగ విచారణలో భాగంగా నిజా మాబాద్, నిర్మల్ జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీ పేరుతో బీసీ వర్గాల ప్రజలను సామాజిక బహిష్కరణకు గురిచేస్తున్న ఉదంతాలు తమ దృష్టి వచ్చాయని ఆయన లేఖలో పేర్కొన్నారు. చట్టబద్ధత లేని ఇటువంటి కమిటీలపై తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.