26-04-2025 11:03:25 PM
- అమీన్ పూర్ మాజీ వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్
- ఎన్ ఎన్ జీ యువసేన ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
పటాన్ చెరు: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నర్సింహాగౌడ్ కోరారు. కశ్మీర్ పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. శనివారం బీరంగూడ జయలక్ష్మీనగర్ కాలనీలోని హైటెన్షన్ రోడ్డులో ఎన్ఎన్జీ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
పహల్గాం ఘటన దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందన్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేకమంది బలి అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరారు. భారత్ వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేలా తగిన శాస్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రమోద్ రెడ్డి, వివిద కాలనీల అధ్యక్షులు, కాలనీల ప్రజలు, ఎన్ ఎన్ జీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.