నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ ఇసుక అక్రమంగా తరలిపోకుండా పోలీసు రెవెన్యూ అధికారులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ తో కలిసి అక్రమ రవాణా ఇసుక నియంత్రణ భూభారతి చట్టం ధరణి పెండింగ్ దరఖాస్తుల సమస్యలు ఇందిరమ్మ ఇండ్ల సర్వే తదితర పథకాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులు వాగులు నదుల నుండి ఇసుక తరలిపోకుండా ప్రతిరోజు తనిఖీలు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రత్నా కళ్యాణి, ఆర్డీవో కోమల్ రెడ్డి, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.