calender_icon.png 24 February, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలి

17-02-2025 11:24:37 PM

అధికారులు బాధ్యతగా చేయాలి..

జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): గ్రేటర్‌లోని అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అందుకోసం బాధ్యతగా చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించొద్దని, సూచించారు. సోమవారం జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమీషనర్ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, సంబంధిత అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టౌన్ ప్లానింగ్ నకు సంబంధించి అక్రమ నిర్మాణాలపై పలు సర్కిళ్లలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం జరగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితంగా ప్రవర్తించడం సరికాదని, ఎవరి పనులు వారు బాధ్యతగా చేయాలన్నారు. నిబంధనల మేరకు అధికారులు పనిచేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు.

టౌన్ ప్లానింగ్  విభాగం అధికారులు స్పీకింగ్ ఆర్డర్స్ జారీ అయిన తర్వాత వెంటనే అనుసరించాల్సిన తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. “నిబంధనల మేరకు అక్రమ నిర్మాణాలు తొలగించడంలో వెనకడుగు వేయరాదని ఆయన స్పష్టం చేసారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై త్వరితగతిన స్పందించి, సకాలంలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 57 విన్నపాలు రాగా, జిహెచ్ఎంసి పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 82 అర్జీలు అందాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శివ కుమార్ నాయుడు, సీపీ పి శ్రీనివాస్ గీతా రాధిక, పంకజ, సుభద్ర దేవి, వేణుగోపాల్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, యాదగిరి రావు సిఏంఅండ్ హె ఓ డాక్టర్ పద్మజ, యు.బి.డి డైరెక్టర్ వెంకటేశ్వర్ రావు, అడిషనల్ సి.సి.పి గంగాధర్, ఎస్టేట్ అధికారి ఉమా ప్రకాష్, డిప్యూటీ సీఈ పనసారెడ్డి, హౌసింగ్ ఈఈ లు పీవీ రమణ, రాజేశ్వర్ రావు, వాటర్ వర్క్స్ సాయి రమణ తదితరులు పాల్గొన్నారు.