బైంసా (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేవారు ఎట్టి పరిస్థితుల్లో వాటికి ప్రమాదకరమైన చైనా మంజాను వాడవద్దని బైంసా సిఐ గోపీనాథ్ హెచ్చరించారు. పట్టణంలోని గాలిపటాలు మాంజాలు విక్రయించే పలు దుకాణాల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.