డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పురుషోత్తం
రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 13 (విజయక్రాంతి): రోడ్డు రవాణా కార్యాలయ అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ పురుషోత్తం హెచ్చరించారు. మంగళవారం సిరిసిల్ల కార్యాల యాన్ని ఆయన తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్రైమాసిక పన్నులు సకాలంలో చెల్లించేలా వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అధికారులు, సిబ్బంది, ప్రజల సౌకర్యార్థం సిరిసిల్ల ఆర్టీవో కార్యాలయాన్ని అనువైన ప్రదేశానికి మార్చనున్నట్లు తెలిపారు. తరలోనే అన్ని సౌకర్యాలు ఉన్న ప్రదే శానికి కార్యాలయాన్ని మారుస్తామన్నారు. ఆయనవెంట డీటీవో లక్ష్మణ్ ఉన్నారు.