calender_icon.png 23 October, 2024 | 2:45 PM

అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

23-10-2024 12:59:40 PM

కల్వచర్లలో కార్డెన్ సెర్చ్ లో మంథని సిఐ రాజు 

మంథని (విజయక్రాంతి): మంథని సర్కిల్ లో అసంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు మంథని సీఐ రాజు హెచ్చరించారు. బుధవారం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో  కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. రామగిరి, మంథని, ముత్తారం ఎస్ఐ లు చంద్ర కుమార్, రమేష్, నరేష్ ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ సెర్చ్ లో పాల్గొన్నారు.  సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేశారు.

అనంతరం గ్రామ ప్రజలతో సీఐ రాజు మాట్లాడుతూ.. గ్రామంలోని యువత గంజాయి, మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని, హెల్మెట్ ధరించాలని, విద్యార్థిని విద్యార్థులు ఎటువంటి కేసుల్లో ఇరుక్కొని తమ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని, సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకోబడునని, మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ సహాయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులతో పాటు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్, సిబ్బంది పాల్గొన్నారు.