14-02-2025 12:24:59 AM
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్
సంగారెడ్డి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): పని చేసే ప్రదేశాలలో లైంగిక వేధింపులకు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి బీ రమేశ్ తెలిపారు. గురువారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు నిరోధక చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు.
పిఓ ఎస్ హెచ్ చట్టం 2013 ప్రకారం పనిచేసే ప్రదేశాలలో మహిళలకు లైంగిక వేధింపులకు గురి చేసే వారిపై కఠినంగా శిక్షించబడతారని తెలిపారు. మహిళా ఉద్యోగులు, కార్మికులు ఎక్కడైనా లైంగిక వేధింపులకు గురైయితే ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి శ్రీధర్ రావు అటవీ శాఖ ఉద్యోగులు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.