25-04-2025 11:19:46 PM
క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి
లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఫైళ్లను త్వరగా పరిష్కరిస్తాం
రోడ్డు ప్రమాదాల నియంత్రణ ప్రత్యేక కృషి
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర...
కామారెడ్డి (విజయక్రాంతి): జిల్లాలో పెండింగ్లో ఉన్న లాంగ్ స్టాండ్ ఫైళ్లను త్వరగా పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో విజయక్రాంతి ప్రతినిధితో ఆయన మాట్లాడారు. జిల్లాలో క్రైమ్ రేట్ తగ్గించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని పోలీసు అధికారులకు క్రైమ్ రేట్ తగ్గించేందుకు పాత పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఫైలు 1960 ఉన్నాయని వాటిలో ఇప్పటివరకు 85 క్లియరెన్స్ అయ్యాయని చెప్పారు. లాంగ్ స్టాండింగ్ లో ఉన్న పెండింగ్ ఫైలు పూర్తిగా క్లియరెన్స్ చేసేందుకు చొరవ చూపుతున్నట్లు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు బ్లాక్ స్పాట్లను గుర్తించామని తెలిపారు. రోడ్లపై రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టవద్దని రోడ్లకు లోపల కల్లాలను తయారు చేసుకొని మరి ధాన్యాన్ని ఎండబెట్టుకోవాలని సూచించారు. లేకుంటే ప్రాణా నష్టాలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్వరగా కేసులను చేయించే వారిని అభినందిస్తూ వారికి ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఆ ఆకస్మిక తనిఖీలు చేసి నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. విధులు నిర్వహించే అధికారులు కేసుల నమోదులో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పేద ప్రజలు తమ సమస్యల పరిష్కారం లభిస్తుందని పోలీస్ స్టేషన్లకు వస్తే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి ఒక్కరు సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేసవికాలంలో వడదెబ్బకు మృతి చెందిన వారికి ప్రభుత్వం నుంచి 2 లక్షల ఆర్థిక సాయం అందుతుందని ఇది తెలియని వ్యక్తులు పోస్ట్మార్టం నిర్వహించకుండా నష్టపోతున్నారని తెలిపారు. ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గ్రామాలలో పోలీసులతో కలిసి ప్రత్యేక టీం లో ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రామాల్లో చోరీలు జరుగుతున్న గస్తీ దళాలు యువకులతో ఏర్పాటుచేసి రాత్రివేళలో గ్రామంలో తిరిగిస్తూ ఉంటే చోరీలు జరగడం తగ్గుతుందన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు కూడా అవసరమేనని తెలిపారు. సీసీ కెమెరాలు ఉన్న చోట 60% పని చేయడం లేదని అవి ఉండి కూడా ప్రయోజనం లేదని గ్రామ కమిటీలు అభివృద్ధి కమిటీలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు పనిచేయని గుర్తించి రిపీయలు చేయించాలని లేకుంటే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. ఎండాకాలం కావడంతో రాత్రి వేళలో ఇండ్లకు తాళం వేసి పడుకోవాలని గ్రామాలకు సెలవుల్లో వెళితే ఇంటికి తాళం వేయడమే కాకుండా విలువైన బంగారు నగలు నగదు ఇండ్లలో ఉంచుకోకుండా బ్యాంకులోని లాకర్లలో విలువైన వస్తువులు పెట్టుకొని వెళ్లాలన్నారు. అంతేకాకుండా పట్టణ ప్రాంతాల్లో పోలీసులకు సమాచారం ఇచ్చి ఇతర గ్రామాలకు పట్టణాలకు వెళ్లాలన్నారు.
పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించనున్నత నాలుగు జరగకుండా అరికట్టుతారన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసుల నమోదు చేసి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకునేలా వారికి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పి రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించి చోరీలు జరగకుండా ఉన్న అరికట్టాలని సూచించారు. ఆన్లైన్ గేమ్లు ఆల్ఫాజూలం లాంటి మత్తు గంజాయి లాంటి పదార్థాలను యువత గాని ఎవరైనా వాడకూడదని దానికి అడాప్ట్అయితే ప్రాణాలు కోల్పోతారన్నారు. కల్తీకల్లు గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించవద్దని సూచించారు.