06-03-2025 12:53:18 AM
బూర్గంపాడు, మార్చి 5 (విజయక్రాంతి): ప్రభుత్వ అనుమతి లేకుండా ఆక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని బూర్గంపాడు ఎస్‌ఐ రాజేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంగళవారం రాత్రి నాగినేని ప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న మాదినేని హరీష్ చెందిన ఏపి39 డివై9279 ట్రాక్టర్ను పట్టుకొని ట్రాక్టర్ డ్రైవర్ చల్లా నాగేశ్వర్ రావును అధీనంలోకి తీసుకొని , ఇసుక లోడు తో ఉన్న ట్రాక్టర్ ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ట్రాక్టర్ డ్రైవర్ చల్లా నాగేశ్వర్ రావు, ట్రాక్టర్ ఓనర్ మాదినేని హరీష్‌లపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.