calender_icon.png 19 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

19-03-2025 12:24:07 AM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు 

  1. ఒకరు రిమాండ్.. పరారీలో మరొకరు
  2. ప్రభుత్వ నిబంధనలను అమలు చేస్తాం: చంద్రశేఖర్, భూత్పూర్ ఎస్సై

మహబూబ్ నగర్ మార్చి 18 (విజయ క్రాంతి) : అక్రమంగా ఇసుక తరలింపు భూత్పూర్ మండల కేంద్రంలో ’దర్జాగా ఇసుక దందా’ అనే కథనం విజయక్రాంతి దినపత్రికలో ఈనెల 9వ తేదీన ప్రచురితమైంది. ఈ కథనంపై స్పందించిన ఎస్సై చంద్రశేఖర్ బృందం మండలంలోని తదితర ప్రాంతాల్లో ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు.  ఈ విషయంపై ఎస్త్స్ర చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాందాస్ తాండ లో ఫిల్టర్ ఇసుక తయారుచేసి అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందింది. అందిన సమాచారం మేరకు మండలంలోని పలు గ్రామాలతో పాటు రాందాస్ తండా తనిఖీలు చేయడం జరిగింది. తనిఖీలలో అక్రమంగా ఇసుక ను తరలిస్తున్నట్లు గుర్తించాము. అక్రమ ఇసుక తరలిస్తున్న శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్ చేయడం జరిగింది.

ఈ విషయంలో మరో వ్యక్తి  మాజీ కౌన్సిలర్ బాలకోటి శీను ని ఎలా రెస్ట్ చేస్తారని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆందోళన చేశారు. నిబంధన విరుద్ధంగా బాలకోటి వ్యవహరించడంతో వఅతనిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు. ఈ కేసు పై దర్యాప్తు మరింత వేగంగా చేయడం జరుగుతుందని ఎస్సైఋ చంద్రశేఖర్ పేర్కొన్నారు.