calender_icon.png 14 April, 2025 | 8:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం అక్రమంగా తరలిస్తే చర్యలు

13-04-2025 12:40:58 PM

అనంతగిరి: అంతర్ రాష్ట్రాల నుండి అక్రమంగా ధాన్యం తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలో రైస్ మిల్లులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పండిన ప్రతి గింజ రైతులకు  మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని సన్న రకాలకు 500 రూపాయల బోనస్ అందజేస్తుందని తెలిపారు అంతర్ రాష్ట్రాల నుండి అక్రమంగా వరి ధాన్యం తరలించకుండా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టీములు చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని తెలిపారు సన్న వడ్లకు లావు వడ్లకు వేరువేరుగా దాన్యం కొనుగోల కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఎండల తీవ్రత  దృష్ట్యా రైతులకు సిబ్బందికి తగిన సూచనలు చేశారు