నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, జనవరి 23 (విజయ క్రాంతి) : ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. గురువారం ఆమె వేము లపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది హాజరు రిజిస్టర్ను, అవుట్ పేషెంట్లు, ఇన్ పేషెంట్లు రిజిస్టర్ లను, డెలివరీల రిజిస్టర్ను తనిఖీ చేశారు.
పీహెచ్సీ లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని, వైద్యులు, సిబ్బంది సకాలంలో విధులకు హాజరుకావాలని సూచించారు. నిత్యం ఎంత మంది రోగులు వస్తున్నది? ఎలాంటి జబ్బులతో వస్తున్నది? సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సౌకర్యాలను పరిశీలించిన వైద్యాధికారితో మాట్లాడారు. రోగులకు అన్ని రకాల సౌకర్యాలు అందించాలని, హైరిస్కు కేసులను జాగ్రత్తగా చూడాలని, అవసరమైతే ఏరియా ఆసుపత్రికి పంపించాలని చెప్పారు.