- దేశవ్యాప్తంగా 1.45 లక్షల మందిపై కేసులు
- ‘స్టేట్ కనెక్ట్’ కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈవో జీ కమలావర్ధన్‌రావు
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఆహార కల్తీపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ ఫుడ్ సేఫ్టీ సీఈవో జి.కమలావర్ధన్ రావు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.
శుక్రవారం సీఐఐ తెలంగాణ, ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ), తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్‌లో ‘స్టేట్ కనెక్’్ట పేరిట ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. గత ఏడాది దేశవ్యాప్తంగా ఆహార కల్తీకి పాల్పడిన 1.45 లక్షల మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తమ శాఖ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపారు. మోడల్ ఫుడ్ స్ట్రీట్స్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో నేషనల్ ఫుడ్ సేఫ్టీ ఈడీ ఇనోషి శర్మ, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ ఆర్‌ఎస్ రెడ్డి పాల్గొన్నారు.