31-03-2025 05:16:12 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావాలని టిఏజిఎస్ జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ అన్నారు. సోమవారం హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశానికి హాజరై జిల్లాలో ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై చిన్న చూపు చూపిస్తున్నాయని, కుమ్రం భీం పోరు గ్రామాలకు సైతం తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఏజెన్సీ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వాలను ఒత్తిడి చేయాలని అనేక సమస్యలతో ఆదివాసి గిరిజనులు కొట్టుమిట్టాడుతున్నారని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. సమావేశంలో జిల్లా నుండి ఉపాధ్యక్షుడు కోట శ్రీనివాస్ ఉన్నారు.