calender_icon.png 30 December, 2024 | 11:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధుమేహానికి ఒత్తిడి ప్రమాదం

17-10-2024 12:00:00 AM

ప్రస్తుతం చాలామంది డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటివారు ఒత్తిడి బారిన పడితే మరిన్ని ఇబ్బం దులు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు వైద్యులు. ఒత్తిడిగా ఫీల్ అయితే మొత్తం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఒత్తిడి స్థాయి పెరిగినప్పుడు శరీరం అనేక రకాల హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ మొత్తాన్ని పెంచుతుంది.

శరీరం అడ్రినలిన్, కార్టిసాల్ అనే రెండు హార్మోన్లను రక్తంలోకి విడుదల చేస్తుంది. శ్వాస రేటు కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో శరీరంలో చక్కెర పెరగడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే ఒత్తిడిని ఎలా నియంత్రించుకోవా లో తెలుసుకోవాలి. మొదట మీ ఒత్తిడికి కారణాలను అర్థం చేసుకోవాలి. మీ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోండి.

వీకెండ్ తర్వాత చాలా మంది తిరిగే విధుల్లో చేరేటప్పడు ఒత్తిడికి గురవుతారు. కాబట్టి ఆ రోజు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. యోగా లేదా వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించడంలో చాలా సహాయపడతాయి. ధ్యానం కూడా మనసును ఆహ్లాదకరంగా ఉంచుతుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో హాయిగా గడపడం వల్ల స్ట్రెస్‌కు చెక్ పెట్టొచ్చు.

ఒత్తిడిని ఎలా గుర్తించాలి ?

  1. తలనొప్పి 
  2. కండరాల నొప్పి లేదా ఉద్రిక్తత
  3. తక్కువగా నిద్రపోవడం
  4. అలసటగా అనిపించడం
  5. చిరాకు
  6. డిప్రెషన్
  7. అశాంతి
  8. అధిక మద్యపానం 
  9. ధూమపానం