* అమీర్ షేక్ మిషాల్‌తో ప్రధాని మోదీ భేటీ
* గల్ఫ్ ఫుట్‌బాల్ కప్ ప్రారంభోత్సవానికి హాజరు
కువైట్/ న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కువైట్, భారత్ మధ్య సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల నాయకులు మరింత కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా కువైట్‌లో మోదీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొనన్నారు. ఆదివారం కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్ అల్ అల్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల సంబంధాలను బలోపే తం చేయడంపై చర్చించారు. అలాగే ఫార్మా, ఫిన్‌టెక్, ఐటీ, సెక్యూరిటీ వంటి కీలక రంగా ల్లో సహకారంపై చర్చించారు. అనంతరం క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ అల్‌న భేటీ అయ్యారు. రక్షణ, వాణిజ్యం వంటి కీలక రంగాలపై చర్చలు జరిపారు.
భారతీయుల సంక్షేమానికి కృషి..
ప్రవాస భారతీయల సంక్షేమానికి కువైట్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా కువైట్ అమీర్ షేక్ మిషాల్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటనలో కువైట్ న్యూస్ ఏజెన్సీ(కూనా)కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలను మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. చరిత్ర, సంస్కృతిని పరస్పర గౌరవంతో ఇరుదేశాలు పంచుకుంటాయని తెలిపారు. ఎనర్జీ, వాణిజ్యం, పెట్టుబడులలో బలమైన సంబంధాలు విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో స్నేహాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రవాస భారతీయులు కృషి చేస్తారని చెప్పా రు.ఇరుదేశాలు చమురు, గ్యాస్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
గల్ఫ్ పుట్‌బాల్ ప్రారంభోత్సవంలో..
అంతకుమందు మొదటిరోజు పర్యటన లో 26వ అరేబియా గల్ఫ్ కప్ ప్రారంభ కార్యక్రమంలో మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కువైట్ అమీర్ షేక్ మిషాల్ అలా మోదీ కలిశారు. ఫుట్‌బాల్ టోర్నీని అధినేతలు వీక్షించారు. ఈ మేరకు అమీర్ షేక్‌ను కలిసిన ఫొటోను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం
కువైట్/న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కువైట్‌లో రెండు రోజుల అధికార పర్యట నలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీని ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్’ అవార్డుతో కువైట్ అమీర్ షేక్ మిషాల్ అల్ అల్ అల్ ఆదివారం సత్కరించారు. కువైట్, భారత్ మధ్య సంబంధాలను బలోపేతం చేయ డంలో ఆయన చేసిన కృషికి ఈ గౌరవం లభించింది. ఇది మోదీకి లభించిన 20వ అంతర్జాతీయ అవార్డు.