calender_icon.png 2 February, 2025 | 4:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌తో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

02-02-2025 02:11:26 AM

సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్ 

హైదరాబాద్, ఫిబ్రవరి 1(విజయక్రాంతి): కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-26ను ప్రగతిశీల బడ్జెట్ పద్దు అని, ఇది వ్యాపార సౌలభ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  సాయిప్రసాద్ పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను బలోపేతానికి దోహదం చేస్తుందన్నారు.

కేంద్ర బడ్జెట్‌పై టూరిజం ప్లాజాలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. మధ్యతరగతిపై పన్ను భారాన్ని తగ్గించడం వల్ల వినియోగం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ ఎపూర్, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ రాచమల్లు, హరీశ్‌చంద్రప్రసాద్, సీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.