15-02-2025 01:25:23 AM
వాషింగ్టన్, ఫిబ్రవరి 14: ఆత్మీయ ఆలింగనంతో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, ఇంధన రంగాలపై ద్వైపాక్షిక చర్చ ల్లో కూలంకషంగా చర్చించారు. అన్ని విషయాల్లో భారత్‌కు ప్రయోజనం చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ సుం కాల విషయంలో, అక్రమవలసదారుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించారు.
వీరిరువురి భేటీ తర్వాత సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించి ఇరువురు నేతలు పలు నిర్ణయా లను వెల్లడించారు. భారత్‌కు అధునాతన ఎఫ్ యుద్ధ విమానాలను విక్రయిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికా లో ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌ను భారత్ మరింత ఎక్కువగా కొనుగోలు చేస్తుంది. ఈ ఏడాది నుంచి ఇండియాకు మిలటరీకి సంబంధించిన ఉత్పత్తులను మరిన్ని విక్రయిస్తాం.
అంతే కాకుండా ఎఫ్ ఫైటర్ జెట్లను కూడా అంది స్తాం’ అని ట్రంప్ తెలిపారు. 26/11 ముంబై దాడుల దోషి తహవూర్ రాణా ను భారత్‌కు అప్పగిస్తామని ట్రంప్ ప్రకటించారు. త్వరలోనే మరింత మంది నేరస్తులకు ఇదే గతి పట్టనుందంటూ ట్రంప్ పరోక్షంగా గురుపత్వంత్‌ను ఉద్దేశిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ అప్పగింతపై మోదీ ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అమెరికాతో భారత్ వాణిజ్యం మరిం త బలపడినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ‘2030 వరకు 500 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యమే మా లక్ష్యం. అమెరికాలో ఉన్న చమురు, గ్యాస్‌పై మరింత ఫోకస్ చేస్తాం. రెండు దేశాల మధ్య మరిన్ని ఒప్పందా లు త్వరలోనే జరుగుతాయని విశ్వసిస్తు న్నా’ అ ని ఆయన పేర్కొన్నారు.
వాణిజ్యపరమైన బేరసారాల్లో మీ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని అను కుంటున్నారని ఓ విలేఖరి ట్రంప్‌ను ప్రశ్నించినప్పుడు, ఈ విషయంలో తనకంటే మోదీనే బెస్ట్ అని ఆయన సమాధానమిచ్చారు.
మాకు శాంతి ముఖ్యం..
రష్యా యుద్ధం చాలా రోజులుగా జరుగుతోంది. కానీ ఆ యుద్ధంపై భారత్ తన వైఖరిని తెలియజేయలేదని చాలా మంది విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ విమర్శలకు మోదీ సమాధానం ఇచ్చారు. ‘యుద్ధం అంటూ వస్తే మేము శాంతి వైపే నిలబడతాం. ఇండియాది తటస్థ వైఖరి అస్సలుకే కాదు. ఇది యుద్ధాలు చేసుకునే రాతియుగం కాదు’. అని మోదీ అన్నారు.
అపురూప కానుక..
అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా అపురూప కానుకను అందించారు. ట్రంప్ రాసిన ‘అవర్ జర్నీ టూ గెదర్’ అనే పుస్తకాన్ని బహుమతిగా ప్రదానం చేశా రు. ఆయన తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన కీలక ఘటనలకు సంబంధిం చిన ఈవెంట్లు ఉన్న ఫొటో బుక్ ఇది.
2019 లో జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమం తర్వాత జరిగిన ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలకు సం బంధించిన ఫొటోలు కూడా దీంట్లో ఉన్నా యి. ఈ పుస్తకంపై ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్’ అని రాసి.. ట్రంప్ సంతకం చేశారు. అనంతరం అందులోని ఫొటోలను మోదీకి చూపిస్తూ మురిసిపోయారు.
ఆ ఒక్కటీ అడక్కు మిత్రమా
మోదీతో భేటీ సందర్భంగా అనేక నిర్ణయాలను ప్రకటించిన ట్రంప్ సుంకాలపై మాత్రం తన వైఖరిని, మొండిపట్టుదలను వదల్లేదు. భేటీకి ముందే సుంకాల విషయంలో ప్రకటన చేసిన ట్రంప్.. ‘మా మీద సుంకాలు వేసే వారిపై తప్పకుండా అంతే స్థాయిలో సుంకాలు వేస్తాం’ అని తెలిపారు. అంతే కాకుండా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై కూడా సంతకం చేశారు.
అక్రమ వలసదారులను వెనక్కి తీసుకెళ్లడానికి సిద్ధం
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భార త పౌరులను వెనక్కి తీసుకురావడానికి భార త్ పూర్తి సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సంయుక్త సమావేశంలో అక్రమవలసదారులపై ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న కు నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. ఒక దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి అక్క డ నివసించే హక్కు ఉండదని ప్రధాని పేర్కొన్నారు.
ఈ విధానం ప్రపంచమంటికీ వర్తిస్తు ందని స్పష్టం చేశారు. ఎవరైనా భారత పౌరు లు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటే వారిని వెనక్కి తీసుకెళ్లడానికి భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో మా నవ అక్రమరవాణా అంతానికి ప్రయత్నాలు జరగాలని ప్రధాని అభిప్రాయపడ్డారు.
మాన వ అక్రమ రవాణా వ్యవస్థను అంతం చేయడానికి భారత్, అమెరికా సంయుక్తంగా ప్రయ త్నాలు చేయాలని ప్రధాని అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద కలలు, వాగ్దానాలకు ఆకర్షితులవుతున్న భారతదేశానికి చెందిన పేద ప్రజలు వలసల ద్వారా మోసపోతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని శుక్రవారం భారత గడ్డ మీద అడుగు పెట్టారు.