calender_icon.png 13 February, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ హయాములోని విద్యాసంస్థల బలోపేతం..

10-02-2025 05:37:47 PM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కార్పోరేట్ లకు ధీటుగా తీర్చిదిద్దారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన అడ్మిషన్ ల పోస్టర్ లను నేరడిగొండలో సోమవారం ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... పేద మధ్య తరగతి విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించారని విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లోనే విద్యాను అభ్యసించాలని అన్నారు. ప్రభుత్వం ఆ దిశగా విద్యాసంస్థలను బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సరస్వతి, మధు, అనిత, మురళి, ప్రభాత్ రావ్, సరితా రావ్, దయాకర్, విజయ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.